Joint firm 16

అన్న మాట ప్రకార మే సరిగ్గా పదిహేను రోజులుండి కరువు తీరా కోదండం తో వేయించుకుని అత్తారింటి కి వెళ్లి పోయింది పద్మ.
ఆమె వెళ్లిన రెండు మూడు రోజుల వరకూ అతనికేం తోచుబాటు అయ్యేది కాదు.
పోనీ, ఇంకో వారం ఉండ మనాల్సింది అని వెట కార మాడింది మంగ , అతని అవస్థ గమనించి.
ఎంతయినా సొంత సరుకు కాదు కదండీ? ఒక వేళ తను మరో వారం ఉన్నా ఆ తరువాత అయినా ఈ ఎడబాటు తప్పదు అన్నాడు తను.
పద్మ తో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచీ మంగ అతనితో ఇదివరకటి కంటే చనువు గా మాటలాడటం ప్రరంభించింది. అతను కూడా ఇది వరకటి లా బిడియం పడటం లేదు, ఆ మెతో మాట్లాడాని కి .

అలా ఓ నెల గడిచింది.
ఒక రోజు ..
కోదండం ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా ఒకతను వచ్చి శేషయ్య గారికి పక్షవాతం వచ్చింది బాబూ. మంగతాయారమ్మ గారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు అన్నాడు.
నమ్మలేక పోయాడు కోదండం. ఆ ఉదయం పొలం వెడుతూ తనని పలకరించి మరీ వెళ్లాడు శేషయ్య..
పొలాన ఉండగా వచ్చిందా ఆ జబ్బు? అని అడిగాడు.
అవును బాబూ ఊరికే ఇలా నడుస్తూ నడుస్తూ క్రింద పడి పోయాడు.

దీ సి కూర్చోబెడదామనుకునేసరికి ఎడమ కాలు ఎడమ చెయ్యి తోడుకు పోయింది. ముఖం కూడా వంక రోయిందండి. మాట కూడా పడి పోయింది. ఉన్న పాలంగా బండి కట్టించుకుని ఇంటికి తీసుకు వచ్చాం. వెంటనే కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకుని వెళితే మంచిదని అందరూ అంటున్నారు. మిమ్మల్ని కేకేసుకు రమ్మని మంగ తాయారమ్మ గోరు చెబితే

వచ్చాను. నేను ఆ పక్కింట్లోకి క మతంలో పాలే రుని. మిమ్మల్ని నాలుగైదు సార్లు చూసేను. రండి బాబూ అన్నాడతను.
వెంటనే పర్మిషను తీసుకుని అతనితో ఇంటి కి బయలు దేరాడు కోదండం. ఆ ఇరుగూ పొరుగూ ఆడా మగా చాలా మంది ఉన్నారు చావిట్లో. గది లోంచి మంగ ఏడుపు వినబడుతోంది. అక్కడున్న వారిని అందరినీ తప్పించుకొని గది లోకి దూసుకెళ్లి పోయాడు తను. తండ్రి పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు శీను. గమ్మున లేచి వచ్చి అతని కాళ్ల కు చుట్టేసుకుని నాన్న మాట్లాడ్డం లేదు మా మయ్యా అంటూ బావురు మన్నాడు.
మంగ అతన్ని చూడ గానే మరింత బిగ్గర గా ఏడవటం ప్రారంభించింది. అదోలా మూలుగుతూ అపస్మారక స్థితి లో పడున్న శేషయ్యను చూడ గానే అతని కి దుఃఖం పొర్లు కొచ్చింది.
ఇలా ఏడుస్తూ కూర్చుంటే కాదు. అతన్ని వెంటనే కాకినాడ తీసుకెళ్లే ఏర్పాట్లు చూడండి అన్నాడు అంత వరకూ శేషయ్య కు ప్రధమ చికిత్స చేస్తున్న ఆచార్యులు.

దాంతో అక్కడున్న వాళ్లంతా తలో రకంగా తలో సలహా ఇవ్వడం మొదలు పెట్టారు. దుఃఖాన్ని ఆపు కోవడానికి ప్రయత్నిస్తూ నాకేం పాలు పోవడం లేదు. అంతా నువ్వే చూసుకోవాలి. ఆయనను ఎలా తీసుకెళ్లాలో ఏమిటో చూడు అంది మంగ దీనంగా.
ఆ మాట కు కోదండం గుండె తరుక్కు పోయింది.
మరేం పరవాలేదు. ముందు మీరు ధైర్యంగా ఉండండి. మీరిలా ఏడుస్తుంటే నేను బెంబేలెత్తి పోతున్నాను అంటూ రుమాలుతో కళ్లు ఒత్తుకున్నాడు.
ఊరిలో ఒక టెంపో ఉండటం చేత శేషయ్య ను తీసుకు వెళ్లడాని కి సమస్యే మీ లేదని చెప్పాడు ఆచార్యులు.
వెంటనే టెంపో కి కబురు పంపించారు. ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయినాయి. శేషయ్యను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలా అక్కడ ఏం చేయాలి ? అన్న విషయం గురించి అక్కడున్న పెద్దలతో చర్చించి వాళ్ల సలహాలు తీసుకున్నాడు కోదండం.

ఎలాగూ అది ఒకటి రెండు రోజుల్లో అయిపోయే పని కాదు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తరువాత శేషయ్యను మంగ ను వదిలి పెట్టి తను వెంటనే వచ్చెయ్యటం బాగుండదు. అందుచేత ఆ పక్కింటి వాళ్ల సైకిలు తీసుకుని ఆఫీసుకు వెళ్ళి నాలుగు రోజులు సెలవు గ్రాంటు చేయించుకుని తిరిగి వచ్చాడు. అప్పటికి గుమ్మం ముందు టెంపో రెడీ గా ఉంది. చావట్లో జనం కూడా పలుచబడ్డారు.
మంగ అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన కోలు కోవడానికి ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు. రెండు మూడు రోజుల్లో ఓ వెయ్యి సర్దుబాటు చెయ్య మని బంగారమ్మ కి చెప్పాను అంది.
అప్పటికి పాలేర్ల ద్వారా శేషయ్య మొదటి భార్య కూతుర్లకు వర్తమానం వెళ్లింది. వాళ్లు రావడంతోనే కాకి నాడ పెద్ద సుపత్రి కి పంపిచెయ్య మని ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పిందామె. మంగ కి సాయం గా ఆమె దూరపు బంధువు ఒకావిడ బయలు దేరింది. మరో మగ మనిషి ఎవరైనా వస్తే తనకీ కాస్త చేదోడు వాదోడు గా ఉంటుంది అనుకున్నాడు కోదండం. కానీ ఎవరి మటుకు వారే తర్వాత

వస్తామని తప్పించుకోవడం తో అతనికి శీను ఒక్కడే తోడయ్యాడు.
హాస్పిటల్లో చేరాక అదృష్ట వసాత్తు అన్నీ సవ్యం గానే జరిగి పోయాయి. శేషయ్యను వెంటనే అడ్మిట్ చేసుకుని
ట్రీట్ మెంటు మొదలు పెట్టారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావటం చేత అలా అంత సడెన్ గా స్ట్రోకు తగిలిందన్నారు. డాక్టర్ల తో ప్రైవేటు గా మాట్లాడి లో పాయ కారంగా ఇవ్వవలి సింది ఇచ్చేసాడు. గాభ రా పడాల్సిన అవసరం లేదనీ, పదిహేను రోజుల పాటు అతన్ని ఇన్ పేషెంట్ గా ఉంచితే చాలా వరకూ కోలు కోవచ్చనీ డాక్టర్లు చెప్పటంతో మంగ మనసు కాస్త కుదుట పడింది.
అ హాస్పిటలు దగ్గరలోనే జిల్లా పరిషత్ ఆఫీసు ఉంది. గోవింద రావు అందులోనే పని చేస్తున్నాడు.
మన కి క్కడ బస ఏర్పాట్లు అతనే మైనా ప్రయత్నం చేస్తాడే మో అడి గొస్తాను అన్నాడు కోదండం.
మంగ అతన్ని పక్కకి పిలిచి, అందుకు ఒప్పుకో లేదు.

అతనంటే ఆయనకి ఇష్టముండదు. ఏ పరిస్థితిలో అతన్ని ఈయన చూస్తే లేని పోని చిరాకులు రావొచ్చు. ఈ సంగతి ఆయన కు తెలియాల్సిన పనేం లేదు. మే మిక్కడ ఉండ గా నువ్వు కూడా అతన్ని కల వొద్దు. మా గురించి కొంచెం శ్రమ తీసుకుని ఆ ఏర్పాటేదో నువ్వే చూడు అందామె.
ఓ వార్డు బోయ్ సహాయంతో హాస్పిటల్ కు దగ్గరలో ఓ గది సంపాయించాడు కోదండం. అక్కడున్న సుమారు ఇరవై గదుల్లో ఇలా హాస్పిటలు పని మీద వచ్చే వాళ్లే ఉంటున్నారు.
ఆ సాయంత్రం శేషయ్య కూతుర్లు, అల్లుళ్లు హాస్పిటల్ కు వచ్చారు. కోదండం వాళ్లని చూద్దాం అదే ప్రధ మం. మంగ వాళ్లని అతనికి పరిచయం చే సింది.
మర్నాటి కి శేషయ్య పూర్తిగా స్పృహ లోకి వచ్చాడు. అయితే అతనికి మాట రావ డానికి రెండు మూడు రోజులు పడుతుందని అన్నారు డాక్టర్ లు. అవతల అల్లుళ్లు ఉండగా తన దగ్గర డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టడం బాగుండదని మంగ కి ఆ డబ్బు ఇచ్చెయ్య బోయాడు కోదండం. ఆమె తీసుకోలేదు. మరేం పరవాలేదు. నీ దగ్గర ఉంచు అంది.

ఆ సాయంత్రం శేషయ్యను చూడడానికి ఆ ఊరు నుంచి చాలా మంది వచ్చారు.
అందరూ అక్కడ ఆ ఇరుకు గదిలో ఉండే బదులు ఒక రు ఇంటి దగ్గర ఉండటం మంచిదని చిన్న కూతురు రాధ ని, ఆమె భర్త ని ఊరి నుంచి వచ్చిన వాళ్లతో పంపేసింది మంగ. మూడో రోజు ఉదయం పెద్ద అల్లుడు వాళ్ల గ్రామం వెళ్లి పోయాడు. పెద్ద కూతురు సరస్వతి మాత్రం అక్కడే ఉండి పోయింది.
కోదండం మాత్రం ఆ నాలుగు రోజులు శేషయ్య మంచం దగ్గరే ఉన్నాడు. మంగను గదికి పంపేసి రాత్రులు హాస్పిటల్ లోనే పడుకున్నాడు. శేషయ్య పరిస్థితి గురించి ఎప్పటి కప్పుడు డాక్టర్లతో మాట్లాడుతూ, బయటి నుంచి కొని తేవాల్సిన మందులు ఏమైనా ఉంటే నిముషాల మీద తెచ్చి అందిస్తుండే వాడు. శేషయ్య కి ధైర్యం చెబుతూ పడి పోయిన కాలూ చెయ్యీ కాస్తూ ఇంట్లో మనిషి లా అన్ని ఉపచారాలూ చేసాడు.
ఇంకా ఉంది.639159cookie-checkJoint firm 16