వ్ – Part 3

హలో
” నేను రవిని”
హా….రవీ చెప్పు…
“ఎందుకు ఫోన్ చెయ్యమన్నారు”?
నాతో మాట్లాడాలి అన్నావ్ కదా అందుకే చెయ్యమన్నాను…
” ఇలా కాదు ఎదురుగా కుర్చుని మాట్లాడాలి”
తేడా ఏమిటంట?
“ఫోన్ లో మాట్లాడితే ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ భావాలు తెలియవు..అసలు నిజమో, అబద్దమో తెలియదు..నటించడానికి అవకాశమెక్కువ…”
సరే నీ ఇష్టం అని ఫోన్ కట్ చేసింది…
……………………………..
మూడు రోజుల తర్వాత….
హలో
” నేను సావిత్రిని”
చెప్పండి..
” రేపు మధ్యాహ్నం ఖాళీగానే ఉంటావా?”
ఉ. రేపు కాలేజీ లేదు…ఖాళీనే
“సరే అయితే మా ఇంటికి వస్తావా?”
వస్తా కానీ ఎందుకు సడన్ గా?
“ఊరికే సరదాగా రా…రాజేశ్వరి apartments తెలుసుగా వెంకటేశ్వర ధియేటర్ పక్కన”..
తెలుసు..
అందులో ఫ్లాట్ నెంబర్ 302…మధ్యాహ్నం 12 తర్వాత రా..
……………………………..
వెళ్ళాడు రవి..లోపలికి వెళ్ళగానే air conditioned గాలి చల్లగా తగిలింది. అదసలు వేశ్యా( వేశ్య) గృహం లా లేదు..ఒక aristocratic atmosphere ఉందక్కడ…కాళ్ళ కింద polished marble, గోడలకి అందమైన paintings, ఓ పెద్ద ప్లాస్మా టీవీ…చాలా అందంగా ఉంది ఇల్లు…
కూర్చో రవి అని దివాన్ కాట్ చూపించి లోపలికివెళ్ళింది సావిత్రి….
రవి ఇంటిని తేరిపార చూస్తున్నాడు….
ఇంతలో ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది సావిత్రి…
చెప్పు రవి ఏంటి మాట్లాడాలన్నావ్?
ఇంత అకస్మాత్తుగా అంటే నాకేం గుర్తు రావడం లేదు..
“పరవాలేదు టైం తెసుకుని అడుగు..”
కాసేపు మౌనం తర్వాత అన్నాడు రవి…మీ అమ్మ కూడా వేశ్యా?
ఆ ప్రశ్నకి ఒకసారే తలెత్తి చూసింది సావిత్రి…”అదేంటి అదేం ప్రశ్న?”
నా ఉద్దేశ్యం…ఈ వృత్తి నీకు వంశ పారంపర్యం గా వచ్చిందా లేక ఏ కారణాల వల్లనైనా నువ్వు ఈ రొంపిలోకి వచ్చావా?
ఏం మాట్లాడలేదు కాసేపు సావిత్రి…
“నేనిక్కడ ఉంటానని అసలు ఎవరికీ తెలీదు…నేనెవర్నీ ఇంటికి పిలవను అసలు…”
నేనడిగిన ప్రశ్నకి జవాబు అది కాదు..
“సరే…నువ్వు కష్టపడి 5000 సంపాదించనక్కర్లేదు”…రా అని తన కౌగిట్లోకి రమ్మన్నట్టు చేతులు చాపింది…
ముందుకి కదలలేదు రవి..
రవి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి ” ఇంతకు ముందు ఒక్కసారి కూడా అనుభవం లేదా”? అని అడిగింది.
లేదు అని అడ్డంగా తల ఊపాడు…
“సరే ఏం కాదు రా”…అని తనని ముందుకు లాగింది….
విదిలించుకుని వద్దు…ముందు నేనడిగింది చెప్పు అని లేచి వెళ్ళిపోయాడు రవి…
రవి వెళ్ళిపోయాక చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది సావిత్రి…అసలు ఆ వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎలా ఉంటారో ఆమెకి బాగా తెలుసు…అంతకన్నా చిన్నవాళ్ళని ( డబ్బున్న వాళ్ళని )తన అనుభవంలో చాలా మందిని చూసింది..అసలు తనకేం కావాలో ఆమెకి అర్ధం కాలేదు..ఆలోచించగా ఆలోచించగా అర్ధమయ్యింది…
రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసింది..
రేపు మధ్యాహ్నం రా రవి అని చెప్పి కట్ చేసింది…
…………………………………
ఈ సారి రవి రాగానే తన బెడ్ రూం లోకి తీసుకెళ్ళింది..అక్కడ గోడ మీద ఒక ఫోటో ఉంది. దాన్ని చూపించి ఆయనే నా భర్త. పేరు తేజ అని చెప్పింది. అక్కడ ఉన్న సోఫా లో కుర్చుని నెమ్మదిగా తన గతం చెప్పడం మొదలు పెట్టింది..
మా నాన్న, నా చిన్నప్పుడే చనిపోయారు..అమ్మ అష్ట కష్టాలు పడి పెంచింది నన్ను..ప్రాణం పోయినా శీలం పోగొట్టుకోకూడదని చెప్పేది మా అమ్మ…నా అందం నాకు ఎప్పుడు శాపమే అయ్యింది…మా అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి చాలా భయపడేది.. అందుకే నాకు 18 సంవత్సరాలకే పెళ్లి చేసింది. నాకు పెళ్ళైన ఆరు నెలల తర్వాత అమ్మ చనిపోయింది..నా భర్త తేజ, నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించేవాడు….ఏ దేవుణ్ణి మనం కళ్ళతో చూడలేదు గనక అందర్నీ నమ్ముదాం..ఎందుకంటే ఆపద కాలంలో ఎవరు ఆదుకుంటారో మనకి తెలీదు కదా అనేవారు…పెళ్ళయిన రెండు సంవత్సరాలకి మాకు పాప పుట్టింది…అంతా సవ్యంగా జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది…పాపకి ఆరు నెలలొచ్చిన తర్వాత ఆక్సిడెంట్ లో ఆయన చనిపోయారు..ఆ మరుక్షణమే నాకు కూడా చనిపోవడానికి బోలెడంత ధైర్యం ఉంది…కానీ పాప నన్ను పిరికిదాన్ని చేసింది…దాన్ని చంపి నేను చచ్చేంత కర్కశత్వం, ధైర్యం రెండూ నాకు లేవు..నన్ను నేను పోషించుకోడానికి నాకున్న డిగ్రీ చదువు చాలనిపించింది . మొండిగా బ్రతకడం మొదలుపెట్టాను..
ఓ రోజు రాత్రి నేను ఒంటరిగా నిద్రపోతున్నాను ఇంట్లో..పాప ఉయ్యాలలో పడుకుంది..రాత్రి 12 గంటలకి తలుపు చప్పుడయ్యింది…నేను ఒంటరి ఆడదాన్ని అన్న నిజం నేను అప్పటికింకా గ్రహించలేదు..కానీ ప్రపంచం గ్రహించింది..ఎవరు అని కూడా అడక్కుండా తలుపు తీసాను…ముగ్గురు మృగాళ్ళు ఇంట్లోకి వచ్చారు…వాళ్ళు తాగి ఉన్నారు..నేను చెయ్యబోయే తరవాత పని తెలుసుకుని, ఒకడు గట్టిగా నా నోరు మూసాడు..ఇంకొకడు ఉయ్యాలలో ఉన్న పాపని తీసి కత్తి పీక మీద పెట్టి నేను నోరు తెరిస్తే చంపేస్తానన్నాడు ….సినిమా కధలా ఉంది కదూ…కానీ నిజం…చాలా నిజాలే తర్వాత కాలంలో సినిమా కధలయ్యాయి…సినిమా కధలు చూసి inspire అయ్యి మళ్ళీ చాలా మంది వాటిని నిజం చేసారు..ఓ పక్క పాప ఏడుస్తుంటే, కొద్దిగా కూడా జాలి లేకుండా ఒకరి తర్వాత ఒకరు అనుభవించారు నన్ను…చిన్న వాడివి..పచ్చి బాలింత అంటే బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు…ఆ క్షణంలో నేను అర్ధించని దేవుడు లేడు…గోడ మీద ఉన్న ముగ్గురిలో ఒక్కరికీ మనసు కరగలేదు…ఆ క్షణంలో నాకు దేవుడి మీద నమ్మకం పోయింది…రెండు గంటల తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయారు….తెల్లవార్లూ నేను ఏడుస్తూ, ఏడుస్తున్న నా పాపని ఊరుకోబెట్టాను…కంప్లైంట్ ఇచ్చి ఒక ఒంటరి ఆడది సాధించేది ఏమీ లేదు..ఆక్కడే ఉంటే ఆ తర్వత రోజు కూడా నేనా క్రూర మృగాలకి బలవ్వాలని నాకు తెలుసు..అందుకే పాపని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాను…నాకున్న డిగ్రీ తో ఒక సంస్థ లో జాయిన్ అయ్యాను…నెలకి 5000 జీతం…దాని డైరెక్టర్ దాస్…నా పరిస్థితి చెప్పగానే చాలా బాధ పడ్డారు…భయపడొద్దని ఎంతో ధైర్యం చెప్పారు..ఆయన మాటలకి నాకు తండ్రి లేని లోటు తీరిందనిపించింది..