వలపుల వల… లక్ష్యం విలవిల

మనసులో మాట
వలపుల వల… లక్ష్యం విలవిల

గ్రూవ్స్ ఆమె లక్ష్యం. ఉన్నతాధికారి కావడమే ధ్యేయం. కానీ ఎన్నో అవాంతరాలు. మరెన్నో తప్పటడు గులు. ఫలితం… అత్యున్నత స్థాయికి ఎదగాల్సిన ఆమె అధఃపాతాళానికి చేరింది.

ఆ వైనం ఆమె ఆత్మీయుడి మాటల్లో… గీత నా చిన్నప్పటి క్లాస్ మేట్. చదువులో టావ్. మాటకారి. చనువు తక్కువ. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైంది. బంధువులే ఆసరా. ఒకే కాలేజీలో చేరినా మావి వేర్వేరు గ్రూపులు. తను రిజర్వుడు కావడంతో మా మధ్య స్నేహం అం తంత మాత్రమే.

డిగ్రీ అయ్యాక తను ఉస్మానియాలో ఎమ్మెస్సీకి చేరింది. లేడీస్ హాస్టల్లో ఉండి చదువుకునేది. నేనదే సమయంలో బీఈడీ చేసి, డీఎస్సీ నెగ్గి టీచరయ్యాను. పెళ్లయింది.

హైదరాబాద్ వెళ్లినప్పుడు స్నేహితుడిగా ఆమెను కలిసేవాణ్ని. అప్పుడే స్నేహం పెరిగింది. పీజీ తరవాత తనకు ఎపీ స్టడీ సర్కిల్లో సీటు వచ్చింది. ‘గ్రూప్స్ లో విజయం సాధించాలన్నది నా కోరిక’ అని తను చెప్పినప్పుడు సంతోషించా. లక్ష్యం బాగుంది. బాగా చదువు.. సాధిస్తావు అని ప్రోత్సహించా. తనకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాను.

గీత మూడు సార్లు గ్రూప్స్, ఓసారి ఎంపీడీఓ పోస్టులకు ఇంటర్వ్యూ దాకా వెళ్లింది. కానీ ఉ్యగం రాలేదు. నిరాశకు గురైంది. బీఈడీ చేసి, డీఎస్సీ రాస్తే ఉద్యోగం వస్తుందని ధైర్యం చెప్పా. ‘ఆ చదువు నా వల్ల కాదు సత్యా. కాలేజీలో లెక్చ రర్ గా చేరుతా. మళ్లీ గ్రూప్స్ రాస్తా’ అంది. సరేనన్నాను.

బాగా డబ్బున్న ఇద్దరు ఫ్రెండ్తో కలిసి ఓ రూమ్ తీసుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆ స్నేహితులకి సరదాలెక్కువ. బోయ్ ఫ్రెండ్తో ఒకటే షికార్లు. ఆ ప్రభావం గీత పైనా పడింది. లక్ష్యాలను మరిచింది. వలపు వలలో చిక్కుకుంది. తన కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ మీద మనసు పారేసుకుంది. ఓ రోజు ఉదయం దాన్నే నిజం చేస్తూ “ఒకసారి నా రూమ్ కి రావాలి. నీతో నా ప్రేమ, పెళ్లి విషయం మాట్లాడాలి” అంటూ ఫోన్ చేసింది. వెళ్లా. ఆమె తను
ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేసింది. “త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం” అంది. ఏమనగలను? మళ్లీ తలూపాను.

కానీ మనసులో అనుమానం. గీత కష్టాల పాలవుతుందేమోనన్న భయం. ఏమనుకున్నా పర్లేదని మర్నాడు ఫోన్ చేశాను. ‘నీకు ఆ ప్రేమ పెళ్లి సరిపడద’ని హెచ్చరించా. వినిపించుకోలేదు. పోనీలే తను సుఖంగా ఉంటే చాలనుకున్నా.
రెండు నెలలకు మళ్లీ ఫోన్. “మా ఇద్దరికి పడటం లేదు. నెలకోసారి మాట్లాడుకుంటున్నాం. ఆరా తీస్తే అతను వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడని తెలిసింది. నువ్వు తక్షణమే రావాల”ని కోరింది. నేనూ, మా ఆవిడా వెంటనే హైదరాబాద్ బయలుదేరాం.

గతం గతః. అతణ్ని మరిచిపో. గ్రూప్స్ సాధించి జీవితంలో స్థిరపడు. ముందు రూమ్ విడిచి మాతో వచ్చెయ్ అని నచ్చ జెప్పాం. “నన్ను మోసం చేస్తాడా? తనకు పనిష్ మెంట్ ఇవ్వాల్సిందే”అంటూ పట్టుబట్టింది. “అలా చేస్తే నలుగుర్లో నవ్వుల పాలవుతావ”ని చెప్పా. ఎప్పటిలానే వినలేదు. తిరుగు ప్రయాణమయ్యాం . వారం తిరిగేసరికి ఆమె నుంచి సమాచారం.

అతణ్నే పెళ్లి చేసుకున్నానని. హమ్మయ్య కథ సుఖాంతం అయ్యిందనుకున్నా.
కానీ మొదటికొచ్చిందని తరవాత తెలిసింది. కొన్నాళ్లు కాపురం చేశాక తను కనిపించకుండా పోయాడు. వేరే అమ్మాయిని
పెళ్లి చేసుకున్నాడు. ఆపరిస్థితుల్లో ఏం చేయాలో అర్ధం కాని గీత ‘నువ్వు ఏ సలహా ఇచ్చినాపాటిస్తా’ నంటూ సాయం కోరింది. ముందు మీ అన్నయ్యలకు చెప్పమని సూచించా. అంతా కలిసి అబ్బాయి ఇంటికెళ్లారు. అతని తల్లిదండ్రులను, చుట్టుపక్కల పెద్దలను పిలిచి నిలదీశారు. విషయం విన్న కొత్త పెళ్లి కూతురూ షాక్ తింది. “కట్నం, నగలతో పాటూ విడాకులు ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటా”నని తెగేసి చెప్పింది. అతని వద్ద పైసా లేని పరిస్థితుల్లో ఆ డబ్బు గీత ఇచ్చింది. తన జీవితాన్ని నిలబెట్టుకుంది.

అయినా అదీ తాత్కాలికమే. హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ఉద్యోగాల్లో చేరిన వారిద్దరూ కలిసి ఉండలేక విడిపో యారు. గీత విడిగా ఓ రూమ్ తీసుకుంది. పెళ్లి అయినట్లు ఎవరికీ తెలియకుండా తాళిబొట్టు,మెట్టెలు తీసేసి నానా యాతన అనుభవించింది. అది చూసి నా మనసు చలించిపోయింది. “అతనితో కలిసుండు. లేదంటే విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకో. ఇలా ఒంటరిగా బతకొద్ద”ని చెప్పా.

ఇది జరిగి మూడేళ్లయింది. తరవాత నా పనుల్తో ఆమె గురించి పట్టిం చుకోలేదు. ఇప్పుడామె ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా కెరీర్ కోసం తపనపడి… వలపు వలలో చిక్కి అధఃపాతాళానికి చేరిందన్న బాధ కలుగుతుంది. ఉన్నత ఆశయాలున్న యువత ఇలాంటి తప్పటడుగులు వేయకుండా ఉంటారనే ఈ ఉత్తరం.