లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 12

లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 12

నేను తినేసి లోపాలకి వచ్చి ప్రియ పక్క సీట్ లో కూర్చున్నాను.

“ఇప్పుడు ఓకేనా ??” అని అడిగింది

నేను అవును అని తల ఊపాను.

ప్రియ తో “నీకు భయం వేస్తే, నా చేయి పట్టుకో….”

“సంజు……అందుకోసమేనా నన్ను ఈ సినిమాకి తీసుకొని వచ్చింది”

“భయపడటానికే గా దయ్యం సినిమ చూసేది”

“సంజు…..నువ్వు కావాలనే తీసుకొని వచ్చావ్”

“అబ్బో మీ చేయి ఇంగ్లాండ్ రాణి చేయి, పట్టుకుంటే కందిపోతుంది” అని అన్నాను.

నన్ను భుజం పైన సరదాగా కొట్టింది. ఇద్దరం నవ్వుకున్నాం.

నేను “స్వీటీ, ఇక్కడున్న అందరికి దయ్యం సినిమా అంటే భయమే, అందుకే చూడటానికి వచ్చారు”

“మాటలు మాత్రం బాగా తెలివిగా మాట్లాడతావ్ ….. సంజు నువ్వు”

“నేనెప్పుడూ నా గురించి నేను ఆలా అనుకోలేదు”

“సంజు……ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు కావాలనే సినిమా కి తీసుకొని వచ్చావ్ కదా ?? అందుకే సినిమా పేరు చెప్పమంటే పొద్దున్న నుంచి చెప్పలేదు నువ్వు”

“అవును నేను కావాలనే నిన్ను ఈ సినిమాకి తీసుకొని వచ్చాను. నేను నా లైఫ్ పార్టనర్ తో కలసి సరదాగా చెయ్యి పట్టుకొని, సినిమా కలసి చూస్తూ ఇద్దరం భయపడుతూ ఎంజాయ్ చేయటానికి…….అయితే ఏంటి స్వీటీ గారు??”

“ఛి…..నాకసలు మాటలు రావటం లేదు” అని కొంచెం నవ్వుతు కోపంగా చెప్పింది.

“ఎందుకు ??” అని నవ్వుతు అడిగాను.

“అది అంతే” అని చెప్పింది.

“స్వీటీ, నీకు నా పై కోపామ్ పడాలో లేక పడకూడదో తెలియటంలేదు కదా ??” అని అడిగాను.

“అవును” అని నెమ్మదిగా చెప్పింది.

“ఏంటి??”

“అవును” అని మాములుగా చెప్పింది.

“సరే నీ ఇష్టం స్వీటీ, నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోదాం, ఓకేనా ??”

ఈ లోపల థియేటర్ లో నేషనల్ అంతెం మొదలయింది. అందరం లేచి నిల్చున్నాం.

అది అయ్యాక “తను కూర్చుంది”

నేను కూడా కూర్చొని “వెళ్దామా ?? ఉందామా??”

తను “సినిమా స్టార్ట్ అయ్యింది గా, చూసేసి వెళ్దాము”

“నువ్వు ఏది డైరెక్ట్ గా చెప్పవ్ కదా స్వీటీ ??” అని నవ్వుతు అడిగాను.

తను నన్ను చేయి మీద కొట్టింది. తనలో ఒక దాగున్న చిరునవ్వు.

“అంత సిగ్గు పడక్కర్లేదులే” అన్నాను.

తను నవ్వేసింది “సంజు…. ఇక నా వైపు చూసింది చాలు….సినిమా అటు వైపు”

ఇక సినిమ మొదలయింది. మొదటి పది నిమిషాలు బాగానే గడిచాయి. ఇక హారర్ మొదలయింది. సడన్ ఒక భయంకరమైన సీన్ రావటంతో నా చేయి ప్రియ గట్టిగా పట్టుకుంది.

సినిమా మొత్తం సీన్ వచ్చినప్పుడల్లా నా చేయిని బాగా గట్టిగ పట్టుకుంది.

ఇంటర్వెల్ వచ్చింది.

“స్వీటీ గారు, మీరు బాగా భయపడినట్లున్నారు”

“నేను చెప్పానుగా, నాకు చాలా భయం అని. ఈ రోజు రాత్రి కొన్ని మంత్రాలు చదువుకొని నిద్ర పోవాలి. మరి ఇలా ఉంటదనుకోలేదు సినిమ”

“అబ్బో…..విషయం చాలానే ఉంది”

“నువ్వు బాగా మాట్లాడుతావ్, నాకు ఈ సినిమా ఒక నెల దాకా అలాగే గుర్తుండి పోతుంది”

“మరి నీకు ఇంత భయం అనుకోలేదు నేను”

“చిన్నపటినుంచి అంతే”

“స్వీటీ ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు సినిమాని ఎంజాయ్ చేశావా లేదా ??”

“పర్లేదు….సెకండ్ హాఫ్ చూసి చెప్తాను”

“నాకైతే సినిమా చాలా నచ్చింది. బాగా హారర్ ఉంది. కథ కొత్తగా ఉంది…ఎఫెక్ట్స్ బాగున్నాయి…మల్ల ఫ్రెండ్స్ తో వస్తాను”

“నీకు అంత నచ్చిందా ??”

“నాకు థ్రిల్లెర్స్ , హారర్ సినిమాలంటే ఇష్టం. అంటే ఏదో హారర్ కోసం సినిమా తీసాం అని కాకుండా, కథలో మంచి పట్టు ఉంటె, నాకు చాలా నచుతుంది. నీకెలాంటి సినిమాలంటే ఇష్టం ??”

“లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలు బాగా ఇష్టం”

“యా నాకు కూడా కామెడీ మూవీస్ అంటే ఇష్టం. అఫ్ కోర్స్ అందరికి కామెడీ ఇష్టం అనుకో”

“hmmmmm…..”
సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. హారర్ మొదలవ్వగానే ప్రియ నా చేయి పట్టుకుంది. సినిమ అయినంత వరకు వదల్లేదు. సినిమా అయిపోయాక మేము కింద ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ తినేసి ఇంటికి వెళ్దామనుకున్నాము. ఫుడ్ కోర్ట్ కి వెళ్లి:

“స్వీటీ…..ఎలా అనిపించింది నీకు సినిమ??”

“బాగుంది..సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎక్ష్పెక్త్ చేయలేదు…”

“య అవును……చాల బాగా ఇచ్చాడు ట్విస్ట్”

కొంచెం సేపు నిస్సబ్దం

“నువ్వు మాత్రం చాలా గట్టిగ పట్టుకున్నవేనా చేతిని, ఒక సీన్ అప్పుడు……”

“అవునా ??” అని నువ్వుతూ అడిగింది.

తన మాటల బట్టి చూస్తే ప్రియ ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది నాతో.

“యా…..”

“సారీ సంజు……”

“ఇట్స్ ఒకే”

ఆఫర్ ఉందంటే ఇద్దరం ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇలా ఇద్దరం కలసి షేర్ చేసుకోవటం ఫస్ట్ టైం. ఇద్దరం ఆలా ఒక చిన్న టేబుల్ మీద కూర్చొని ఆలా తినటం.

ఇన్ని సందర్భాలలో తనను ఇంత ఫ్రీ గా చూసింది మొదటి సరి. తనతో ఇలా సమయం గడపడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. తను ఇప్పుడు బాగా తెలిసిన వ్యక్తి లాగా అనిపిస్తుంది.

రోజు రోజు కి తన పైన ఇష్టం అలాగే అట్రాక్షన్ నాకు పెరుగుతున్నాయి. తనతో ఇలాగె రోజు గడపాలనిపిస్తుంది. తన తీయటి మాటలు, వింత చేష్టలు, మూసి మూసి నవ్వులు, మొహం పై చిరు కోపం అన్నిటిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

తినేసి కారులో ప్రియని ఇంట్లో దింపాను. తను నాకు ఒక కవర్లో తన జాకెట్ ఇచ్చింది. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్లి కార్ పెట్టేసి, నా అపార్ట్మెంట్ కి చేరుకున్నాను. ఆ రోజు రాత్రి తన గురించే ఆలోచనలన్నీ తన గురించే అన్ని ఉహించుకున్నాను.

ప్రియ తో ఇంకా పెళ్లి దాకా కలవకూడదని అనుకున్నాను. ఎందుకంటే, తనని కలిసినప్పుడల్లా సంతోషం, తర్వాత అప్పుడుదే సమయం అయిపోయిందని బాధ. తన పై ఎన్ని ఫీలింగ్స్ ఉన్న కంట్రోల్ చేసుకోవలసి వస్తుంది. తనని ముద్దుపెట్టుకోవాలని, కానీ ఏమి చేయలేని పరిస్థితి. తనను కలసి నప్పుడల్లా హోమ్ సిక్ గా ఫీల్ అయ్యినట్లు “ప్రియ సిక్” అయిపోతున్నాను. పోయిన సరి కూడా అంతే. తనని కలసిన తర్వాత భయంకరమైన ఊహలు, తన పై కంట్రోల్ చేసుకోలేని అట్రాక్షన్.

పెళ్లయ్యాక తనతో బాగా ఫ్రీగా ఉండొచ్చు. తనతో చెప్పి నా కోరికలన్నీ తీర్చుకోవచ్చు. రోజు తనతో సమయం గడపొచ్చు. తనతో చాల క్లోస్ గా సరదాగా ఉండొచ్చు. ఇద్దరం కలసి మాకు కావలసిన విధంగా జీవించొచ్చు. తనతో నా ఫీలింగ్స్ అన్ని ఫ్రీగా చెప్పుకోవచ్చు, తనతో దగ్గరగా సమయాన్ని గడపొచ్చు. ఎన్ని సార్లైనా ముద్దులుపెట్టొచ్చు, చిలిపి పనులు చేయొచ్చు, తన అందాల్ని కళ్ళార్పకుండా చూడొచ్చు, ఇద్దరం కలసి ఎప్పుడు కావాలన్న బయటకి వెళ్లొచ్చు, చాటింగ్ చేయొచ్చు, పిచ్చి పిచ్చి మెసేజీలు పెట్టొచ్చు, తనతో రొమాన్స్ చేయొచ్చు….

కానీ ఇప్పుడు మాత్రం, కేవలం ఊహలు మాత్రమే. అందుకే ఇక పెళ్లయ్యేదాకా నిజమైన కారణం ఉంటె తప్ప ప్రియను కలవకూడదని అనుకున్నాను. ఎందుకంటే రోజు రోజు కి తనను తలచుకొని ఒక పిచ్చివాడినైపోతున్నాను. తను ఆలా పక్కనుంటే చాలు ఏదో చెప్పలేని ఒక బలమైన ఫీలింగ్ నాకు.

టు బె కంటిన్యూడ్……