ఖర్కోటఖుడు – Part 5

ఖర్కోటఖుడు – Part 5

హర్ధిక్ హోటల్ కి చేరుకున్నాడు. రూమ్ కి వెళ్ళగానే రిసెప్షన్ కి కాల్ చేసి మందు, ఫుడ్ ఆర్డర్ చేసాడు. సోఫాలో కూర్చుని బాక్స్ ఓపెన్ చేసాడు.
అందులో ఒక ఎలెక్ట్రానిక్ డివైస్ ఉంది. అది చూడటానికి కత్తి పిడిలా ఉంది. అది కాకుండా ఒక పెన్ డ్రైవ్ ఇంకా ఒక ఫైల్ ఉంది.
ఫైల్ ఓపెన్ చేసాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఫైల్ పక్కన పెట్టేసి ఓపెన్ చేసాడు. బాయ్ వచ్చి అతని ఆర్డర్ లోపల పెట్టేసి వెళ్లిపోయాడు.

బాటిల్ లో మందు గ్లాసులో ఒంపుకుని సిగరెట్ తాగుతూ ఫైల్ చదవసాగాడు. అది ఓపెన్ చెయ్యగానే “TIME TRAVELLING” అని టైటిల్ కనిపించింది. అందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ మెషీన్ తయారు చేసే విధానం గురించి వివరిస్తున్నాయి.
ఫైల్ మూసేసి మందు తాగుతూ లాప్టాప్ కి పెన్ డ్రైవ్ పెడదాం అని ఓపెన్ చేసాడు.

స్క్రీన్ మీద మెయిల్ రిసీవ్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది. అది మల్హోత్రా మెయిల్. అందులో ఒక వీడియో ఉంది.
దానిని ప్లే చేసాడు. అదలా ఉండగా ఇక్కడ మల్హోత్రా బుర్రలో జ్ఞాపకాలు గిర్రున తిరుగుతున్నాయి.
నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే గుండె ఆగినట్టు ఉంది మల్హోత్రాకి.

ఒక్క రోజు వెనక్కి…

మల్హోత్రా ల్యాబ్ లో పని చేసుకుంటున్నాడు. ఇంతలో మెయిన్ సర్వర్ స్ట్రక్ అయ్యింది. 5 నిముషాలు పని చెయ్యలేదు. అది మళ్ళీ మాములుగా పనిచెయ్యడం మొదలుపెట్టగానే ట్రిగ్గర్ లోపల కనెక్షన్ ఒకటి శాచురేట్ అయిపోయింది. కానీ అప్పటి వరకు ట్రిగ్గర్ తయారీకి ఏదో తెలియని అడ్డంకి తొలగిపోయింది. అవును ట్రిగ్గర్ పనిచేయడం మొదలుపెట్టింది.
మల్హోత్రా ఆనందానికి అవధులు లేవు.

వెంటనే ఈ విషయం చెప్పడానికి ఫోన్ అందుకున్నాడు. కానీ దీని పనితీరు పరిశీలించడానికి నిర్ణయం తీసుకున్నాడు.
ట్రిగ్గర్ తీసుకుని సీక్రెట్ డోర్ దగ్గరికి వచ్చాడు. స్కానర్ మీద చెయ్యి పెట్టగానే అడుగు మందం ఉన్న ఉక్కు తలుపు చప్పుడు లేకుండా తెరుచుకుంది.
లోపల లైట్లు వెలిగి రూమ్ మొత్తం వెలుగు పరుచుకుంది.
కానీ అది రూమ్ కాదు.
*****TIME MACHINE*****
రిచర్డ్స్ ముందే చెప్పాడు. ప్లేన్ అయినా పట్టేలా ఉండాలి అని.

మల్హోత్రా అడుగులో అడుగు వేసుకుంటూ సర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. సర్వర్ చేరుకోగానే చేతిలో ట్రిగ్గర్ దాని పాయింట్ లో అమర్చాడు.
పవర్ బటన్ నొక్కగానే గది మొత్తం చలనం వచ్చేసింది. సర్వర్ స్టార్ట్ అయ్యింది.
Destination అడుగుతుంది.

రెండు రోజుల క్రితం డేట్ ఎంటర్ చేసాడు అందులో మల్హోత్రా.

చైర్ లో ఉన్న మల్హోత్రా కొన్ని క్షణాలు అందులోనే బందీ అయ్యాడు. ఆ కొన్ని క్షణాలు గది మొత్తం చీకటి అయ్యింది.
ఆ చెర విడగానే మెయిన్ సర్వర్ ఆఫ్ అయిపోయింది.
వెంటనే కుర్చీ నుండి లేచాడు మల్హోత్రా. తన ప్రయోగం ఎందుకు విఫలం అయ్యిందో అర్ధం కావట్లేదు. అతని మనసంతా చాలా చిరాగ్గా ఉంది.
బయటకి వచ్చి డోర్ క్లోజ్ చేసాడు. తన ల్యాబ్ వైపుకి నడుస్తున్న వాడల్లా తాను చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోయాడు.

అక్కడ మల్హోత్రా రిచర్డ్స్ నిలబడి ఉన్నారు. అంటే.. అంటే తన ప్రయోగం విజయవంతం అయ్యింది. యాహూ.. అని అరవబోయిన వాడల్లా ఆగిపోయాడు.
నెమ్మదిగా మెషీన్ లోపలికి చేరుకున్నాడు.

“Excuse me సర్..” రిఫ్రెష్ మెంట్స్ తీసుకువచ్చిన ఎయిర్ హోస్టెస్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు మల్హోత్రా.
&&&&&
ఇక్కడ హోటల్ రూమ్ లో మెయిల్ లో వీడియో చూస్తున్న హర్ధిక్ ఫోన్ రింగయ్యింది.
షబ్నం ఫోన్ చేస్తుంది.

ఎందుకు చేస్తుంది అనుకుంటూనే ఫోన్ ఎత్తాడు హర్ధిక్.
ఎత్తగానే “హలో” అంటూ షబ్నం గొంతు తియ్యగా వినిపించింది.
“హలో మేడం.. ఏంటి ఈ టైంలో?” అన్నాడు హర్ధిక్
“ఏ మీకు ఈ టైం లోనే ఫోన్ చెయ్యాలి అనే రూల్ ఏమైనా ఉందా?” అని అడిగింది షబ్నం నవ్వుతూ..
“అలా ఏం లేదు. సర్లే చెప్పండి. ఏంటి విషయం?” డైరెక్ట్ గా మేటర్ కి వచ్చేసాడు హర్ధిక్.
“ఏం లేదులే. ఉంటాను” అంటూ ఆమె ఫోన్ పెట్టేయబోతుంటే హర్ధిక్ ” హలో.. హలో.. ఏంటి మేడం? ఏమయ్యింది?” అంటున్నాడు.
“ఏమీ లేదు కానీ.. నేను అనుకుంటుందే నువ్వు కూడా అనుకుంటే రోడ్ నంబర్10 లో అరుణ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చి పిక్ చేసుకో” అంటూ ఫోన్ పెట్టేసింది.