Joint firm 27

శేషయ్యను హాస్పిటలు నుంచి ఇంటికి తీసుకొచ్చేనాటి కి నాలుగు రోజుల ముందే పద్మ అత్త వారింటికి వెళ్లి పోయింది.
రాధ పుట్టి నింటనే ఉన్నప్పటికీ కోదండం తో ఇదవ్వడానికి సావ కాశం కుదిరేది కాదు. శేషయ్యను చూడడానికి ఎవరో ఒక రౌ రావడం పోవడం తిరుగుతూండటం చేత ఎప్పుడు చూసినా ఇంటి నిండా మను షులున్నట్టే అవుపిస్తుండేది.
ఆ రద్దీ తగ్గి ఇంట్లో మామూలు పరిస్థితులు నెల కోవడానికి సుమారు పదిహేను రోజులు పట్టింది. రాధ, వాళ్ల అక్కా కూడా వాళ్ల వాళ్ల ఊళ్ల కు వెళ్లి పోయారు. అప్పటికి కర్ర, ఊత తో కాస్త నడవ గలిగే స్థితికి వచ్చాడు శేషయ్య. సాయంత్రం ఆఫీసునుంచి రావడం తోనే ఆయనను అలా రోడ్డు
మీది కి కొంత దూరం తీసుకు వెళ్లి తీసుకు రావడం కోదండం డైలీ దిన కార్యక మమయి పోయింది.
ఈ లోగా..

అమ్మ నిన్ను చూడాలంటోంది. మూడు నాలుగు రోజులు సెలవు పెట్టుకు రా అని వాళ్ల నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. కోదండాని కి. ఈ ఉద్యోగంలో చేరిన రెండవ నెలలో ఒక సారి మాత్రం ఇంటికి వెళ్లాడతను. ఆ తరువాత మరో సారి వెడదామను కునే సరికి పద్మరావడం, అనుకోకుండా ఆమెతో తొడ పరిచయం కలగడంతో ఇంటికి వెళ్లాలన్న ఆలోచన నిరవధికంగా వాయిదా పడి పోయింది. పోనీ ఇప్పుడయినా వెడదామను కొని సెలవడిగితే అతి కష్టం మీద రెండు రోజులకు మించి కుదరదన్నారు. దానికే అంగీకరించాడు.

నువ్వు లేక పోతే నాకసలేం తోచదు. రెండు రోజుల్లో వచ్చెయ్యి సుమా అని ప్రాధేయ పడ్డాడు శేషయ్య. తన కంత కన్నా సెలవు లేదని చెప్పి స్వగ్రామం బయలు దేరాడు కోదండం.
కానీ అనుకున్న టైముకు రాలేక పోయాడు.
అతను అక్కడికి వెళ్లిన రెండో రోజునే అతని పెద తండ్రి గుండె పోటు వల్ల అకస్మాత్తుగా మరణించడం తో మరింక తప్పని సరిగా ఉండి పోవాల్సి వచ్చింది.

జీతం పొతే పోయింది. నువ్వు మధ్యలో వెళ్లి పోవడం బాగుండదు. పెద్ద కర్మ అయ్యే వరకూ ఇక్కడుండడం తప్పదని మీ ఆఫీసుకు రాసేయి అని చెప్పాడు తండ్రి. ఆయన మాట కాదన లేక పోయాడు.
అ ప్రకార మే కర్మ అయ్యేంత వరకూ ఉండి తిరుగు ప్రయాణం కట్టాడు. కోదండం. తీరా బస్సు డిపో దగ్గరకి వెళ్లే సరికి మూలపల్లి కి బస్సులు నడవడం లేదన్న వార్త తెలిసింది. ఏమిటీ విషయం అని ఆరా తీస్తే తెలిసిన భోగట్టా ఇదీ.
అయిదు రోజుల క్రితం ఏదో లగే జు విషయం ఘర్షణ వచ్చి ఆ ఊళ్లో కొందరు కుర్రాళ్లు ఓ బస్సు డ్రయివ రుని చిథక గొట్టి వదిలే సారట. అందు చేత ఆ
గ్రామ పెద్దలంతా జరిగిన దానికి క్షమాపణ చెప్పిస్తే తప్ప ఆ రూట్లో బస్సులు తిప్పమని డ్రయివర్లూ, కండక్టర్లూ మొ
రాయించుకు కూర్చునారుట. ఆ క్రితం రోజే ఆ గ్రామ పెద్దలు కొందరొచ్చారు గానీ ఆ విషయం పరిష్కారం కావడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అనుకుంటున్నారు. ఈ లోగా మూల పల్లి వెళ్ల వలసిన వారు కేదారి పురం

శివారున దిగి, ఆ మూడు మైళ్లూ కాలి కి బుద్ధి చెబుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
చచ్చానా దేముడా అనుకున్నాడు కోదండం. కానీ చెయ్య గలిగింది ఏముంది. మూలపల్లి వెళ్లే మనుషులు ఎవరయినా దొరుకుతారేమో నని చూసాడు. దురదృష్టం కొలదీ ఒక శర్తీ కూడా తగల్లేదు. కేదారి పురం శివారున బస్సు దిగి ఉసూరు మటూ నడక సాగించాడు సూత్ కేసు పట్టు కుని.
రిజల go 8 Day –
అప్పటికి సుమారుగా రెండయ్యింది టైం. తను మండుటెండలో నడవాలని భయపడ్డాడు గానీ బండి దిగే సరికి కాస్త మబ్బుగా ఉంది. వాతావరణం. క మక మం గా ఆ మబ్బులు మరీ దట్ట మవుతుండటం తో కొంపదీసి వర్షం తగులు కోదు కదా అన్న శంక పట్టు కుంది కోదండాని కి. ఎందుకైనా మంచిదని వడివడిగా నడవడం ప్రారంభించాడు.
నాలు గు ఫర్లాంగులు వెళ్లే సరికి కుడి పక్క ఖచ్చా రోడ్డు మీద నుంచి ఓ సవారీ బండి వస్తోంది. మైసూరు ఎడ్లు మంచి ఉత్సాహంగా పరుగులు

తీస్తున్నాయి. అది మూలపల్లి వెళ్లే దయితే బావుండును అను కున్నాడు తను.
అత ను ఆశించి నట్టు పెద్ద రోడ్డు మీద కు రావడం తోనే మూలపల్లి దిక్కుగా తిరిగింది. బండి. ఆ క్షణంలో అతనికది రోడ్లీ రోయిస్ కారులా అవుపించింది. రోడ్డు వార గా ఆగి అంత కంత కీ చేరువవుతున్న ఆ బండి వంక చూసాడు. తొట్టిలో కూర్చుని బండి తోలుతున్న ఆసామీ పాలేరు వాల కంగా కనిపించాడు. లోపల కూర్చున్న వాళ్లెవరూ చూడడానికి వీలు లేకుండా ఒక తెర కట్టబడుంది.
మీ బండి మూల పల్లెనా వెళ్లేది అన డి గాడు కోదండం ఆ బండి దగ్గర గా రానిచ్చి. తొట్టిలో కూర్చున్న తల పాగా మనిషి ఎడ్లను అదిలించి ఆపి ఏమిటి బాబూ అనడిగాడు. తన ప్రశ్న రెట్టించాడు కోదండం. బండి వాడు ఔనన్నట్టు తలూ పాడు.
నేనూ ఆ ఊరే వెళ్లాలి. అటు చూస్తే వాన వచ్చేలా ఉంది. మీ బండిలో ఎక్కడానికి సావకాశం ఉంటుందేమో నని ఆశ గా చూసాడు అతను.

దానికేం భాగ్యం గానండీ. లోపల ఆడంగులున్నారు. మిమ్మల్ని ఎక్కించుకోవడానికి మరి కుదరదండి. ఏమీ అనుకోమాకండి అని సవినయం గా చెప్పి మరలా ఎడ్ల ను అదిలించాడు అతను.
నిరాశ గా నిట్టూర్చాడు కోదండం. బండి ముందుకు సాగింది. లోపల ఉన్నదెవరో తెలుసుకోవడానికి సావ కాశం లేకుండా వెనక వేపు కూడా తెర కట్టేసి ఉంది. మహా ఘోషా స్త్రీల్లా ఉన్నారు ఉక్రోషంగా గొణుక్కునాడు తను. అంత లోనే ఎవరో ఆ తెర కాస్త పక్కకి వత్తి గిలించింది. కళ్లు విప్పార్చి చూ సాడు. తెరచాటు నుంచి ముఖం సరిగ్గా కనిపించలేదు తనకి. వెడుతూ వెడుతూన్న బండి మళ్లీ ఆగింది.
కోదండం మన సులో చిన్న ఆశ చిగురించింది. పక్కగా ముందుకి నడిచహాడు. మీరు శేషయ్య గారింట్లో ఉంటునారా అండీ? బండి వాడు కుతూహలంగా అడిగాడు. అవునన్నట్టు తల తాటించాడతను.
మరైతే నేను త మల్నెప్పుడూ చూడ లేదండీ. ఇందాక అలా అన్నందుకు మరోలా అనుకోకండి.

బండెక్కండి. వెళ్లి పోదాం అన్నాడు బండి వాడు వినయంగా.
తెర తప్పించి చూసిన ఆసామీ తనని ఫలానా అని పోల్చి వాడికా సంగతి చెప్పి ఉండాలనుకున్నాడు కోదండం. ఏమయితే నేం తనకి నడక బెడద తప్పించి నందుకు సంథో షిస్తూ వెనుక తెర తప్పించి సూట్ కేసు లోపల పెట్టి బండి ఎక్కి కూర్చున్నాడు.
ఆ లోపల ఒకే ఒక వ్యక్తి కూర్చుని ఉండటం అతన్ని ఆశ్చర్యం చకితున్ని చేసింది. లోపల ఆడంగులున్నారు అని ఆ బండి వాడు చెప్పిన మాట మీద ఆ లోపల ముగ్గురు నలుగురు ఉండి ఉంటారని అనుకున్నాడు తను. తీరా చూస్తే అది గౌరవ వాచ క మన్న మాట!
ఆ పోనియ్ కొండన్నా ఆమె హుకుం జారీ చేసింది బండి వాడికి. బండి ముందుకు కదిలింది.
***************

సర్దుకుని కూర్చుంటూ ఒక సారి ఆమె వంక పరీక్షగా చూసాడు కోదండం.
సు మారు ముప్పై సంవత్సరాలు దాటి ఉంటాయి. పచ్చగా గుండ్రటి ముఖం, పెద్ద కళ్లు. మనిషి నిండుగా బలంగా ఉంది. ఇంతకు ముందె ప్పుడో చూసాను అనుకున్నాడు మనసులో.
నడక తప్పించి నాకు ఈ బండిలో కూర్చోవడాని కి అను మతి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండీ అన్నాడు వినయంగా.
పరవాలేదు, దాని దే ముందండి అందామె నవ్వుతూ. ఆ మె ముఖంలో చిన్న సిగ్గు కూడా తొంగి చూసింది.
శేషయ్య గారికి మీరు బంధు వులాండీ? అన్నాడు కోదండం
ఇంకా ఉంది



6371915cookie-checkJoint firm 27