చండవేగుడని అంటారని వాత్స్యాయనుడు

———- పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2 పడక గదిలోకి అడుగు పెట్టగానే ఎటువంటి వాతావరణం ఉండాలో గత వారం చూశారుగా! పడక గది అలకరణ ఎలా ఉండాలో ఇక ఇప్పుడు చూద్దాం.
పడక గదిలో ఇంతకు ముందు వివరించిన శయ్య ఒకటి ఉండాలి. అంతకంటే తక్కువ ఎత్తులో మరొక శయ్య కూడా అందుబాటులో ఉంచుకోవాలి. శృంగార కార్యకలాపాలకు వినియోగించిన శయ్యను నిద్రించడానికి వాడరాదు. రతి అనంతరం విశ్రమించడానికి, ఒక పడక కుర్చీ వంటిది వాడుకోవాలని, నిద్రించడానికి ఈ చిన్న మంచాన్ని వాడుకోవాలని వాత్స్యాయనుడు చెబుతాడు. మంచానికి అందుబాటులో సుగంధ ద్రవ్యాలు ఉంచుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక అరుగుగాని, అర గాని ఏర్పాటు చేసుకోవాలి.
పడక గదిలో ఒక శృంగార గ్రంథాన్ని, శృంగార రసాత్మకమైన చిత్రపటాలనుఅమర్చుకోవాలి. స్త్రీ పురుషుల వినోదం కోసం చదరంగం, జూదం వంటి క్రీడలకు ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఏదేమైనా శృంగార క్రియకు ఉద్దీపనం వలె పనిచేయడానికే ఈ సూత్రాలన్నీ.
పడక గది చెంతనే సువాసనలిచ్చే వృక్షాలున్న ఉద్యానవనం ఉండాలి. పడక గది, ఈ ఉద్యానవనం పరిశుభ్రంగా ఉంటూ నిత్యం సువాసనలు వెదజల్లుతుండాలి మనసైనప్పుడు సంగీత రసాస్వాదన చేయడానికి వీణ, వేణువు వంటి వాయిద్యాలు అందుబాటులో ఉండాలి.
పడక గది అలంకరణ గురించి వాత్స్యాయన ముని ఇచ్చిన సూచనలను సంక్షిప్తంగా వివరించాం. పడక గది అలంకరణ గురించి తెలుసుకున్నారుగా! రసవంతమైన శృంగార జీవనానికి పురుషుడు పాటించవలసిన నియమాలను, దైనందిన జీవితం గురించి కూడా వాత్స్యాయనుడు వివరించాడు. ఆ నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం.
తెల్లవారక ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి సుగంధ భరితమైన ధూపం వేసుకుని, తాంబూలం సేవించి అప్పుడు మిగిలిన దైనందిన జీవితం ఆరంభించాలి. పురుషుడు ప్రతి రోజూ రెండు పూటలా స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. క్షుర కర్మ కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి. రాత్రి పూట వేడి నీటితోనే స్నానం చేయాలి. పగటినిద్ర పనికిరాదు. అపరాహ్ణ వేళకుముందే పగటిపూట భోజనం పూర్తి చేయాలి. చీకటి పడిన సుమారు రెండు జాముల ప్రాంతంలోరాత్రి భోజనం చేయాలి. పగటి భోజనం కంటే రాత్రి పూట భోజనమే శరీరానికి శక్తినిస్తుందని వాత్స్యాయనుడు చెబుతాడు.
పడక గదికి కాని, సంకేత స్థలానికి కాని స్త్రీ కంటే ముందుగా పురుషుడే చేరుకుని ఆమె కోసం నిరీక్షించాలని, తనను చేరిన ప్రియురాలిని అలరించి, ఏదైనా కారణం వల్ల అలక మీదుంటే ఆ అలుక తీర్చి ఆమెను శృంగార క్రీడకు సమాయత్తం చేయాలి .
———-
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3
స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి.
ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాం
శశ జాతి : మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.
వృష జాతి : మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.
అశ్వజాతి : మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.
పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్స్యాయనుడు. మృగి జాతి : జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.
బడబ జాతి : జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.
హస్తినీ జాతి : జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.
శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగ విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు. అవి ఏమేమిటో చూడండి.
కన్య : యుక్త వయసులో ఉన్న వివాహము కాని స్త్రీ.
పునర్భువు : ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ.
వేశ్య : పడుపు వృత్తి జీవనాధారముగా గల స్త్రీ.
స్త్రీ పురుషులను వాత్స్యాయనుడు వర్గీకరించినట్టే మరికొందరు కూడా శారీరక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. వారు ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు? తదితర అంశాలు పరిశీలిద్దాం.
జననేంద్రియాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీ పురుషులవర్గీకరణ ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నాం కదా! స్త్రీ పురుషులలో అంగ ప్రమాణం సరిసమానంగా ఉన్నవారికే రతిలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషుల అంగాలు సమపరిమాణంలో వుంటేనే సమరతం అనాలి. ఇక సంయోగంలో మూడు సాధారణ భంగిమలున్నాయి. అవి 1). ఉత్ఫుల్లకం, 2). విజృంభితకం, 3). ఇంద్రాణికం.
1). ఉత్ఫుల్లకం :
స్త్రీ తన శిరస్సును తలదిండుపైనే వుంచి నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ సంభోగం సాగించడం. ఇలా నడుము భాగాన్ని బాగా పైకి ఎత్తటం వల్ల స్త్రీ మర్మాంగం వెడల్పుగా విచ్చుకుని అంగప్రవేశం, రతిక్రీడ సులభమవుతాయి. ఈ బంధంలో స్త్రీ పాదాలు పురుషుని నడుమును చుట్టివేస్తాయి.ఈ బంధంలో పురుషుని అంగప్రవేశం జరిగిన తరువాత స్త్రీ తన జఘనభాగాన్ని గుండ్రంగా తిప్పాలి. అయితే తొందరపాటు పనికిరాదు.2). విజృంభితకం : స్త్రీ వెల్లకిలా శయనించి తొడలను అడ్డంగా పైకిలేపి నిలిపివుంచి రతిక్రీడలో పాల్గొనడాన్ని విజృంభితకం అనాలి. ఈ భంగిమలో తొడలను అడ్డంగా చాచి వుంచటం వల్ల స్త్రీ అంగద్వారం విశాలం అవుతుంది. పురుషాంగం ప్రవేశం, రతిక్రియ సుఖవంతంగా వుంటాయి.3). ఇంద్రాణికం : స్త్రీ తన తొడలను పిక్కలను కలిపి సమానంగా పక్కభాగానికి వంచి మోకాళ్ళు కూడా పక్కలకు వుండేటట్లు వంచి సంభోగిస్తే ఆ బంధాన్ని ఇంద్రాణీ బంధం అంటారు. అయితే ఈ బంధం క్లిష్టమైనది. అభ్యాసం చేత సాధింపదగినది. తొందరపాటు కూడదు” అన్నారు వాత్స్యాయనులు. స్త్రీ పురుషుల అంగ ప్రమాణాలు సమానంగా ఉంటే అది సమరతం అనుకున్నాము. అలాకాక స్త్రీ అంగప్రమాణం అధికమై పురుషుని అంగప్రమాణం తక్కువైనప్పుడు నీచరతం అవుతుంది. దీనిలో
1). సంపుటకం, 2). పీడితకం, 3). వేష్టితకం, 4). బాడబకం అని నాలుగు విధాలు.
స్త్రీ పురుషులు కాళ్ళను బారజాపి రతికి ఉపక్రమిస్తే అది సంపుటకం. ఈ సంపుటకం పార్శ్య సంపుటకం, ఉత్తాన సంపుటకం అని రెండు రకాలు.
స్త్రీ పురుషులు ఒకరి పక్కన ఒకరు శయనించి రతిక్రీడ సాగించడం పార్శ్య సంపుటకం.
స్త్రీ వెల్లకిలశయనించి పురుషుడు ఆమెపై అధిరోహించి రతి సాగించడం ఉత్తాన సంపుటకం.
ఈ సంపుటన బంధాలలో స్త్రీ పురుషుని అంగాన్ని తనలో ప్రవేశింప చేసుకొని తన రెండు తొడలూ గట్టిగా కలిపి నొక్కి ఉంచటాన్ని ఫీడితకం అంటారు.
ఉత్తాన, పార్శ్య సంపుటాలలో స్త్రీ పురుషులు క్రీడలో ఉన్నప్పుడు స్త్రీ తన కుడితొడను పురుషుడి ఎడమ తొడమీద, ఎడమతొడను పురుషుడి కుడితొడమీద వుంచితే వేష్టితక బంధం అంటారు. దీనిలో స్త్రీ మర్మాంగం ముడుచుకుని ఉంటుంది. అందువల్ల పురుషుని అంగానికి పీడనం కలిగి సుఖాస్పదం అవుతుంది. అలాగే పురుషాంగాన్ని ఆవిధంగా పీడించటంవల్ల స్త్రీకి ఒత్తిడి కలిగి సుఖాస్పదం అవుతుంది. ఇది కొద్దిపాటి అభ్యాసంతో సాధ్యమవుతుంది.
తరువాతిది బాడబక బంధం- దీనిలో స్త్రీ ‘బడబ’ వలె అంటే ఆడగుర్రంలా కదలకుండా ఉంటుంది. స్త్రీ కదలక మెదలక పరుండి పురుషుడి అంగాన్ని యోనితో తనలోనికి గ్రహించి అంగాన్ని బాగా గట్టిగా నొక్కిపట్టి వుంచుతుంది. ఇది చాలా అభ్యాసంతోనే సాధ్యమవుతుంది. బాడబక బంధంలో నిపుణులు ఆంధ్రదేశీయులైన స్త్రీలని బాభ్రవ్యులు అన్నారు – తదాంధ్రీషు ప్రాయేణీతి సంవేశన ప్రకారా . ఆంధ్రస్త్రీలు అభ్యాసాసక్తి కలవారు. 1). భుగ్నకం ,
2). జృంభితకం
3). ఉత్పీడితకమ్*
4). అర్ధపీడితకం
స్త్రీ వెల్లకిలా శయనించి రెండు తొడలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆ తొడలను కౌగలించుకొని క్రీడావ్యగ్రుడయితే దాన్ని భుగ్నకం అంటారు.
స్త్రీ కాళ్ళను పైకి చాచివుంచగా పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుకభాగాన్ని తన భుజాలకు ఆనించి ఊరువులను కౌగిలించుకొని క్రీడించడాన్ని జృంభితకం అన్నారు.
స్త్రీ రెండు పాదాలను పురుషుని రొమ్ముకు ఆనించి వుంచగా పురుషుడు రతి క్రీడను సాగించడం ఉత్పీడితకమ్* అంటారు. దీనిలో మరో భేదం వుంది.
స్త్రీ ఒక పాదాన్ని పురుషుని వక్షస్థాలానికి ఆనించి రెండవ కాలును సూటిగా చాచి వుంచినప్పుడు అర్ధపీడితకం అనే బంధంగా పరిగణిస్తారు.
ఈ భంగిమలను ఆచరించి దంపతులు పూర్తి స్థాయిలో శృంగార రసరాజ్యంలో తేలియాడవచ్చు. శృంగార జీవితం ఎంత ఆనందంగా ఉంటే దాంపత్య సుఖం అంత మెరుగ్గా ఉంటుంది.
———-
స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4
స్త్రీ పురుషులలో వివిధ జాతుల గురించి, రతి క్రీడలోని కొన్ని విధానాల గురించి గతంలో తెలుసుకున్నాం కదా! ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1). పద్మినీ జాతి స్త్రీ:
పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది.
చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు.
తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది.